హీరో గోపీచంద్ కు జోడీగా మహానటి ?

Actress Keerthy Suresh To Pair Up With Gopichand In Teja Upcoming Movie Alamelu Manga Venkata Ramana

సక్సెస్ ఫుల్ “చిత్రం ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సినిమాటోగ్రాఫర్ తేజ దర్శకత్వంలో రూపొందిన “నువ్వు నేను “, “జయం “, “నిజం “, “నేనే రాజు నేనేమంత్రి ” మూవీస్ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా “అలిమేలు మంగ వెంకట రమణ ” మూవీ తెరకెక్కనుంది. తేజ దర్శకత్వంలో రూపొందిన “జయం “, “నిజం ” మూవీస్ లో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తేజ మూవీ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అలిమేలు మంగ వెంకట రమణ ” మూవీ లో హీరోయిన్ గా అనుష్క , కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆమె ఎవరో కాదు పలు తెలుగు , తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం లో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో నటిస్తున్నారు. హీరో గోపీచంద్ , కీర్తి సురేష్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందనున్న “అలిమేలు మంగ వెంకట రమణ ” మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడం లో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =