శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” తెలుగు రీమేక్ “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేత థామస్ , అనన్య నాగళ్ళ , అనసూయ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వకీల్ సాబ్ ” మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యువరాణి గా, అర్జున్ రామ్ పాల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2 వ తేదీ”వకీల్ సాబ్ ” మూవీ టీజర్, క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ టైటిల్ రిలీజ్ కానున్నాయని సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వకీల్ సాబ్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , “మగువా” సాంగ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూవీ తో పాటు టీజర్ కొరకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: