సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “పోకిరి ” మూవీ హిందీ లో సల్మాన్ ఖాన్ హీరోగా “వాంటెడ్ ” మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. మాస్ మహారాజా రవి తేజ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “విక్రమార్కుడు ” మూవీ హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా “రౌడీ రాథోడ్ ” మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన “అర్జునరెడ్డి “మూవీ షాహిద్ కపూర్ హీరో గా “కబీర్ సింగ్ ” గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటినుండీ బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు టాలీవుడ్ లో విజయం సాధించిన పలు చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. “అల .. వైకుంఠపురములో .. “, జెర్సీ , “HIT “, “F 2″ , ” మత్తు వదలరా “, “టాక్సీవాలా “, “బ్రోచేవారెవరురా ” మూవీస్ హిందీ భాషలో రీమేక్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన “బాహుబలి” , “బాహుబలి 2” , “సాహో ” మూవీస్ హిందీ లో ఘనవిజయం సాధించడం తో టాలీవుడ్ మూవీస్ పై బాలీవుడ్ నిర్మాతలకు క్రేజ్ పెరిగింది. ఈ విధంగా బాలీవుడ్ లో టాలీవుడ్ చిత్రాల హవా కొనసాగుతుంది. చిన్న , పెద్ద సినిమాలు తేడా లేకుండా విజయం సాధించిన తెలుగు మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: