
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 82


'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్

థ్రిల్లర్ టీవీ సిరీస్ లో కాజల్ అగర్వాల్
రానా-మిహికా పెళ్లి ప్రత్యేకతలు అవేనట ..!

నేను చిరునవ్వుతోనే నిద్రలేవడానికి కారణం అదే..!

విజయ్ సేతుపతికి జోడీ గా అనుష్క ?

హైదరాబాద్ లో "వాలిమై "షూటింగ్ !

"కోబ్రా" రెట్రో లుక్
ఈ వారం సినిమా వార్తలు మీకోసం..!
అందుకే రిలేషన్ షిప్ లో లేను..!
'చిట్టిబాబు' సెటైర్ - పనికొచ్చే వార్తలే వింటా..!
ఐదు భాషలలో రిలీజ్ కానున్న "మర్డర్ " మూవీ ట్రైలర్
నాగశౌర్యకు జోడీగా "రొమాంటిక్ "భామ

తమన్నా యోగా "హృదయ ముద్ర"

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రానున్న క్వారెంటైన్ పోస్టర్..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దానితో సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుండి క్వారెంటైన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాటలను విడుదలచేసింది చిత్రయూనిట్.

థ్రిల్లర్ టీవీ సిరీస్ లో కాజల్ అగర్వాల్
ABC స్టూడియోస్ బ్యానర్ పై జోషువా సఫ్రాన్ దర్శకత్వంలో థ్రిల్లర్ టీవీ సిరీస్ "క్వాంటికో" (2005 ) రూపొందింది. ఈ సిరీస్ లో 3 సీజన్ లలో 57 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి."క్వాంటికో" టీవీ సిరీస్ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ గా ప్రియాంక చోప్రా నటించారు. ఇప్పుడు "క్వాంటికో" టీవీ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
'ఆకాష్' కు 'పూరీ' సపోర్ట్ - నీకు ఏది నచ్చితే అది చెయ్..!
నేడు డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఆకాష్ పూరీ తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడా జరపవద్దని లేఖను ను కూడా విడుదల చేశాడు. మరోవైపు ఈ సందర్భంగా ఈ కుర్ర హీరోకి పలువురు సినీ సెలబ్రిటీస్ పుట్టిన రోజులు శుభాకాంక్షలు కూడా చెప్పారు.
రానా-మిహికా పెళ్లి ప్రత్యేకతలు అవేనట ..!
వచ్చేనెలలో రానా-మిహికా ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటినుండే పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు ఇరు కుటుంబసభ్యులు. తన ప్రేమను పరిచయం చేసిన దగ్గర నుండి అన్ని పనులు చక చక జరిగిపోయాయి. ఎంగేజ్ మెంట్ అవ్వడం పెళ్లి ముహూర్తం అన్ని పెట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. ప్రభుత్య నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేయనున్నారు.
ఆగస్ట్ లో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ టీజర్ !
అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు.

నేను చిరునవ్వుతోనే నిద్రలేవడానికి కారణం అదే..!
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో సాయిపల్లవి కాస్త భిన్నమని చెప్పొచ్చు. సహజత్వాన్ని చాలా దగ్గరగా అనిపిస్తుంది తనను చూస్తుంటే. సినిమాల్లో తాను సెలెక్ట్ చేసుకునే పాత్రలు కానీ... తన డ్రెస్సింగ్ కానీ... మేకప్ కానీ ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చూస్తేనే చెప్పొచ్చు సాయి పల్లవి అభిరుచి ఏంటో. తన ఇన్స్టా లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ..

విజయ్ సేతుపతికి జోడీ గా అనుష్క ?
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్దం " విడుదలకు సిద్ధంగా ఉంది.US లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళం , హిందీ , ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ , ట్రైలర్ లు ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
త్వరలో 'కె.జి.యఫ్ 2' అప్ డేట్ ఇస్తా అంటున్న డైరెక్టర్..!
కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. అసలే ఇక ఈ సినిమా రిలీజ్ ఎలాగూ లేట్ అవుతుండటంతో కనీసం ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. ఇక వారికి కాస్త ఊరట కలిగించే న్యూస్ ఒకటి చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈరోజు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు కావడంతో.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'కె.జి.యఫ్ 2' గురించి అడుగగా. `త్వరలోనే…

హైదరాబాద్ లో "వాలిమై "షూటింగ్ !
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్ హీరో కార్తికేయ ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

"కోబ్రా" రెట్రో లుక్
సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్ " మూవీ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1" మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రీ లుక్ తోనే అదరగొడుతున్న నాగశౌర్య
మొత్తానికి నాగశౌర్య కొత్త సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసినట్టే కనిపిస్తుంది. ఇప్పటికే తను వర్కౌట్స్ చేస్తూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నాగశౌర్య బాడీ ట్రాన్స్ఫామేషన్ చూసి అందరూ షాకయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమాకు సంభందించిన ప్రీ లుక్ ను రిలీజ్ చేసి మరోసారి షాకిచ్చాడు.

6ఏళ్ల సినీ ప్రయాణం - పట్టుదల, ఆత్మవిశ్వాసమే అతని బలం..!
ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. కానీ వారి సినీ కెరీర్ మాత్రం తమలోని నటన.. సినిమాలను ఎంచుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తనను తాను కొత్త కొత్త పాత్రలతో.. కొత్తగా ఆవిష్కరించుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. ఆ హైట్.. పర్సనాలిటీ.. ఫిట్ నెస్ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు సాయి శ్రీనివాస్ కు ఉండటంతో.. తండ్రి సహకారంతో వెండితెరపై అడుగుపెట్టాడు.
ఈ వారం సినిమా వార్తలు మీకోసం..!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.
అందుకే రిలేషన్ షిప్ లో లేను..!
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్ తగ్గిపోతుంది. ఈలిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా, నితిన్ ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతన్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెగా కుటుంబంలో ముందు వరసలో ఉన్న చరణ్, బన్నీ పెళ్లి చేసుకున్నారు. వరుణ్, శిరీష్ ల పెళ్ళిళ్లకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ముందు వరుసలో కనపడుతుంది సాయి తేజ్ ఒక్కడే. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా ఇక కష్టమేనని ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పేసాడు.

రీతు వర్మ Exclusive Interview - వాళ్లే నన్ను బెస్ట్ యాక్ట్రెస్ గా చేశారు
పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రీతు వర్మ. ఈ సినిమాతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. తెలుగులో రీతు వర్మ చివరి సినిమా కేశవ. కేశవ తర్వాత తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో తమిళ్ లో బిజీ అయింది ఈ అమ్మడు. రీసెంట్ గా కనులు కనులు దోచాయంటే అనే సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులో హిట్ కొట్టింది. దీనితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రీతు వర్మ 'దతెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
'చిట్టిబాబు' సెటైర్ - పనికొచ్చే వార్తలే వింటా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ చరణ్ పోస్ట్ ఏంటి అంటే.. తన ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లో రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు ఫొటోను పోస్ట్ చేసి... ”కేవలం నిజమైన సమాచారాన్ని మాత్రమే వింటున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనితో రామ్ చరణ్ వేసిన సెటైర్ ఎవరికబ్బా అని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ఆర్జీవీ ఇష్యూ పైనే అని అంటున్నారు.
ఐదు భాషలలో రిలీజ్ కానున్న "మర్డర్ " మూవీ ట్రైలర్
బ్లాక్ బస్టర్ "శివ " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను రూపొందించి క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్ర దర్శకుడిగా మారారు . "స్మగ్లర్ వీరప్పన్ ", "రక్త చరిత్ర ", "లక్ష్మీస్ ఎన్టీఆర్ ", "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు " వంటి నిజ జీవిత కథలను వర్మ తెరకెక్కించారు. మనుషులను పోలిన మనుషులను వెతికి సినిమాలు రూపొందిస్తున్న దర్శకుడు వర్మ ను అభినందించాల్సిందే. ఇప్పుడు "పవర్ స్టార్ "మూవీ ని వర్మ రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
నాగశౌర్యకు జోడీగా "రొమాంటిక్ "భామ
మోడల్ . సింగర్ , యాక్ట్రెస్, యూట్యూబర్ కేతిక శర్మ డబ్ మాష్ వీడియో క్లిప్పింగ్స్ లో ఇంటర్ నెట్ లో పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న కేతిక ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా లోని ఇతర ఎకౌంట్స్ లో కేతిక కు అధిక ఫాలోయింగ్ ఉంది. ఆకాష్ పూరి హీరోగా రూపొందిన "రొమాంటిక్ " మూవీ తో కేతిక టాలీవుడ్ లో ప్రవేశించారు. కేతిక ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తమన్నా యోగా "హృదయ ముద్ర"
సక్సెస్ ఫుల్ "శ్రీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమన్నా హీరోయిన్ గా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమన్నా ప్రస్తుతం "సీటీ మార్ ", బోలె చుడియన్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ "ది నవంబర్స్ స్టోరీ " తమిళ వెబ్ సిరీస్ తో తమన్నా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లో ఎంటర్ అవుతున్నారు.