టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో సాయిపల్లవి కాస్త భిన్నమని చెప్పొచ్చు. సహజత్వాన్ని చాలా దగ్గరగా అనిపిస్తుంది తనను చూస్తుంటే. సినిమాల్లో తాను సెలెక్ట్ చేసుకునే పాత్రలు కానీ… తన డ్రెస్సింగ్ కానీ… మేకప్ కానీ ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చూస్తేనే చెప్పొచ్చు సాయి పల్లవి అభిరుచి ఏంటో. తన ఇన్స్టా లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉదయాన్నే తనను భూమాత సర్‌ప్రైజ్ చేస్తుందని సాయిపల్లవి తెలిపింది. అందుకే తాను ప్రతిరోజు చిరునవ్వుతో నిద్రలేస్తానని చెప్పింది. తన ఇంటి బయట నుంచి తీసిన వీడియోలో చూస్తే పెద్ద ఇంద్రధనుస్సు ఒకటి ఇందులో కనబడుతుంది. నిజంగానే చూడటానికి ఈ సీన్ చాలా బాగుంది.
View this post on Instagram
The reason I woke up with a smile…was coz mama earth threw in a surprise 🌸 #rainbow #6am #hatti
మలయాళ సినిమా ’ప్రేమమ్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది సాయిపల్లవి. ప్రేమమ్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ఇక ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసేసింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ లో నటిస్తుంది సాయిపల్లవి. దీనితోపాటు ఈ భామ విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు.
![Video thumbnail](https://img.youtube.com/vi/my4yAvsiLqM/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/QoLRpvhDDjA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/FgfmSpTZ1NA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/azYVDdVvrWw/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)