ఐదు భాషలలో రిలీజ్ కానున్న “మర్డర్ ” మూవీ ట్రైలర్

Murder Movie Trailer To Release In 5 Languages

బ్లాక్ బస్టర్ “శివ ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను రూపొందించి క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్ర దర్శకుడిగా మారారు . “స్మగ్లర్ వీరప్పన్ “, “రక్త చరిత్ర “, “లక్ష్మీస్ ఎన్టీఆర్ “, “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ” వంటి నిజ జీవిత కథలను వర్మ తెరకెక్కించారు. మనుషులను పోలిన మనుషులను వెతికి సినిమాలు రూపొందిస్తున్న దర్శకుడు వర్మ ను అభినందించాల్సిందే. ఇప్పుడు “పవర్ స్టార్ “మూవీ ని వర్మ రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా వర్మ షార్ట్ ఫిల్మ్స్ , మూవీస్ రూపొందిస్తున్నారు. టెక్నాలజీ ని ఉపయోగించుకుని వర్మ ఆన్ లైన్ ద్వారా వాటిని రిలీజ్ చేస్తున్నారు. నట్టీస్ ఎంటర్ టైన్ మెంట్ , క్విటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై అనురాగ్ కంచన్ సమర్పణలో రామ్ గోపాల్ వర్మ “మర్డర్ ” మూవీని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో నిర్మించారు. పరువు హత్య నేపథ్యం లో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన ఈ మూవీ కి ఆనంద్ చంద్ర దర్శకుడు. “మర్డర్ ” మూవీ ట్రైలర్ ఐదు భాషలలో జులై 28 వ తేదీ 9.08 AM కు రిలీజ్ కానుందని వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =