‘ఒరేయ్ బుజ్జిగా’ జ్యూక్ బాక్స్ రిలీజ్

Kumari 21F Actor Raj Tarun and Malvika Nair's Latest Movie Orey Bujjiga Juke Box Is Out

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాట‌ల‌ను విడుద‌ల‌చేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఈ మాయ పేరేమిటో.. ఏమిటో..’ అంటూ హుషారుగా సాగే ఈ పాట‌ని సిద్ శ్రీ‌రామ్ పాడారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ కె.కె రాసిన ఈ పాట‌ను అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన ఆలపించారు. ‘కృష్ణ‌వేణి ..కృష్ణ‌వేణి’.. అంటూ రాహుల్ సిప్లిగంజ్.. ‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా’ పాట‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ రూబెన్స్ పాడారు. ‘క‌ల‌లు చూసినా క‌న్నులే నేడు మోసెనే క‌న్నీల్లే… హాయి పంచినా గుండెకే ఓ గాయ‌మ‌య్యెనే..’ పాటను సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించారు. ఈ సినిమాలోని పాట‌లు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుల‌య్యాయి.

 

కాగా మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =