హైదరాబాద్ లో “వాలిమై “షూటింగ్ !

Thala Ajith Valimai Movie Shoot To Begin In Hyderabad In August

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై “తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్ హీరో కార్తికేయ ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వాలిమై ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది. తరువాత చెన్నై లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక సెట్ లో ఆగస్ట్ లో “వాలిమై ” మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా 4 నెలల గ్యాప్ తరువాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఆగస్ట్ నెలలో పలు మూవీస్ సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. కన్నడ స్టార్ హీరో సుదీప్ “ఫాంటమ్ “మూవీ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =