ABC స్టూడియోస్ బ్యానర్ పై జోషువా సఫ్రాన్ దర్శకత్వంలో థ్రిల్లర్ టీవీ సిరీస్ “క్వాంటికో” (2005 ) రూపొందింది. ఈ సిరీస్ లో 3 సీజన్ లలో 57 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి.”క్వాంటికో” టీవీ సిరీస్ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ గా ప్రియాంక చోప్రా నటించారు. ఇప్పుడు “క్వాంటికో” టీవీ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“క్వాంటికో” టీవీ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా పాత్రకు కాజల్ అగర్వాల్ ఎంపిక అయ్యారు. లాక్ డౌన్ సమయం లో ముంబై లో తన ఇంటి సభ్యులతో కాజల్ ఎంజాయ్ చేస్తూ షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న “మోసగాళ్ళు “, కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ “ఇండియన్ 2″లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: