‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ రానున్న క్వారెంటైన్ పోస్టర్..!

Akhil Akkineni Upcoming Movie Most Eligible Bachelor Quarantine Poster To Release On 29th July

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దానితో సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ నుండి క్వారెంటైన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =