విజయ్ సేతుపతికి జోడీ గా అనుష్క ?

Actress Anushka Shetty To Pair Up With Vijay Sethupathi For The First Time In A Movie Directed By AL Vijay

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్దం ” విడుదలకు సిద్ధంగా ఉంది.US లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళం , హిందీ , ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ , ట్రైలర్ లు ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్క ఒక తమిళ మూవీ లో నటించే అవకాశం ఉంది. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి పలు తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. “సైరా నరసింహారెడ్డి ” మూవీ ద్వారా విజయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “ఉప్పెన ” మూవీ లో విజయ్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఒక మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ లో విజయ్ కు జోడీగా అనుష్కను ఎంపిక చేయాలని దర్శకుడు భావించి అనుష్కను సంప్రదిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు ఏ ఎల్ విజయ్ , అనుష్క కాంబినేషన్ లో రూపొందిన తమిళ మూవీ “దైవ తిరుమగళ్ “(నాన్న తెలుగు ) ఘనవిజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =