ఈ వారం సినిమా వార్తలు మీకోసం..!

TFN Rewind: Important Updates In This Week

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఫీషియల్ – ప్రభాస్ 21లో దీపికా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

 

క్రేజీ కాంబోలో ‘ఓ మై కడవులే’

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఓ మై కడవులే “. తమిళంలో సూపర్ హిట్ అయింది ఈ సినిమా. ఇక విశ్వక్ సేన్ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమాస్ ‘ఓ మై కడవులే’ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు తెలుగులో డైలాగ్ రైటర్ గా పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ను కన్ఫామ్ చేశారట. ప్రస్తుతం తరుణ్.. విశ్వక్ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడట.

3ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ఫిదా’

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ కామెడీ రూపొందిన ఎంటర్టైనర్ ఫిదా. ఈ సినిమా 2020 జులై 21కి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి పిల్ల పాత్రలో తన నటనతో సాయిపల్లవి అందరినీ ఫిదా చేసేసింది. ఇక వరుణ్ తేజ్ కూడా వరుణ్ పాత్రలో ఒదిగిపోయాడు. చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ ని బాగా హ్యాండిల్ చేశాడు. ఇక సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను సైతం అందుకుంది సాయి పల్లవి.

‘మహాసముద్రం’ లో ‘మజిలీ’ పిల్ల..!

అజయ్ భూపతి తన రెండవ మూవీ గా యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” రూపొందించనున్న విషయం తెలిసిందే. శర్వానంద్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ లో కథానాయికగా “మజిలీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ నటించనున్నట్టు తెలుస్తుంది.

‘బిగ్ బాస్4’ లో లేమంటున్న హీరోస్

బిగ్ బాస్ సీజన్4 మొదలు అవుతున్న నేపథ్యంలో పలువురు హీరోలు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. యంగ్ హీరో కార్తికేయ, తరుణ్ బిగ్ బాస్ 4 లో పార్టిసిపేట్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ అధికారికంగా తెలిపారు.

పలు భాషల్లో “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” రీమేక్

స్వరూప్ RSJ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఇక హిట్ అయిన సినిమాలకు రీమేక్ లు తప్పవు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాను కూడా పలు భాషలలో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. తమిళ, మలయాళ , హిందీ భాషలలో రీమేక్ కానున్నదట.

‘చిరు’ కు విలన్ గా ‘అధీర’..?

మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పాత్రలో బాలీవడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు కానీ వార్తలు మాత్రం వస్తున్నాయి.

నితిన్ ఎంగేజ్ మెంట్

హైద‌రాబాద్‌లో నితిన్ – షాలినిల ఎంగేజ్ మెంట్ జరిగింది. కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించారు. ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు పెళ్లి జరగనుంది. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ ఈ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు.

 

బాలీవుడ్ కి ‘అరుంధతి’..?

కోడి రామ కృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ డ్రామా “అరుంధతి ”. అరుంధతి గా అనుష్క , పశుపతి గా సోను సూద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “అరుంధతి ” మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీ హిందీ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే అరుంధతి గా నటించనున్నారని సమాచారం.

జపాన్ లో “సాహో” రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ తెలుగు లో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తం గా థియేటర్స్ అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే కదా. అయితే జపాన్ లో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత “సాహో ” మూవీ రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో జపాన్ లో తొలిరోజు అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం గా “సాహో ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

‘బిచ్చగాడు2’ అనౌన్స్మెంట్

బిచ్చగాడు సీక్వెల్ బిచ్చగాడు 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఇక జులై 24న విజయ్ ఆంటోనీ తన పుట్టినరోజు సందర్భంగా.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసాడు. అంతెేకాదు దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో ప్రకటించారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 6 =