‘ఆకాష్’ కు ‘పూరీ’ సపోర్ట్ – నీకు ఏది నచ్చితే అది చెయ్..!

Director Puri Jagannadh Pens Heart Warming Birthday Greetings To Akash Puri On Twitter

నేడు డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఆకాష్ పూరీ తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడా జరపవద్దని లేఖను ను కూడా విడుదల చేశాడు. మరోవైపు ఈ సందర్భంగా ఈ కుర్ర హీరోకి పలువురు సినీ సెలబ్రిటీస్ పుట్టిన రోజులు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కొడుకు ఆకాష్ కు తన స్టయిల్ లోనే విషెస్ చెప్పాడు పూరీ జగన్నాథ్. పూరీ జ‌గ‌న్నాథ్ ట్విట్ట‌ర్ ద్వారా ‘‘మనకు సినిమా తప్ప మరో పని తెలియదు. నాకంటే కంపర్ట్‌బుల్ డాడ్ ఎవ‌డూ ఉండ‌డు. జీవితంలో ఏం కావాల‌నుకుంటున్నావో అది చెయ్‌. నీ వెనుక నేనుంటా. హ్యాపీ బ‌ర్త్ డే! రా! .. చీర్స్‌’’ అని విషెస్ చెప్పాడు. ఇక పూరీ చెప్పిన స్టైల్ కు నెటిజెన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.

ఆకాష్ పూరీ బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత.. ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమైనా ఆ సినిమాలు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం అనిల్ పాడూరిదర్శకత్వంలో ‘రొమాంటిక్’ సినిమాతో రాబోతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eighteen =