ప్రీ లుక్ తోనే అదరగొడుతున్న నాగశౌర్య

Tollywood Young Actor Naga Shaurya Woos Social Media Audience With His Prelook Poster Of NS20

మొత్తానికి నాగశౌర్య కొత్త సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసినట్టే కనిపిస్తుంది. ఇప్పటికే తను వర్కౌట్స్ చేస్తూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నాగశౌర్య బాడీ ట్రాన్స్ఫామేషన్ చూసి అందరూ షాకయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమాకు సంభందించిన ప్రీ లుక్ ను రిలీజ్ చేసి మరోసారి షాకిచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచుతుంది. ప్రీ లుక్ లో నాగ శౌర్య కండరాలతో మునుపెన్నడూ లేనంతగా కనిపించాడు. మరోవైపు పాత్ర కోసం గడ్డం కూడా పెంచినట్టు తెలుస్తోంది ఇక దీనితో పాటు ఫస్ట్ లుక్ ఈ నెల 27 న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.

దీనితో పాటు పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. . నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ తో కూడా
ఒక సినిమా లైన్లో పెట్టాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 9 =