“కోబ్రా” రెట్రో లుక్

Cobra Movie Team Releases A Movie Poster Of Chiyaan Vikram In Retro Look

సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ ” మూవీ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ “కోబ్రా ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1” మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కోబ్రా ” మూవీ లో చియాన్ విక్రమ్ 20 గెటప్స్ లో కనిపించడం విశేషం . “కోబ్రా ” మూవీ షూటింగ్ రష్యా దేశం లో ప్రారంభం అయింది. కరోనా మహమ్మారి కారణంగా చిత్ర యూనిట్ ఇండియా కు తిరిగి వచ్చింది. 75 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “కోబ్రా ” మూవీ ని మే నెలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు చిత్ర యూనిట్ “కోబ్రా ” మూవీ లోని విక్రమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. విక్రమ్ రెట్రో లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో విక్రమ్ “కోబ్రా ” మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “మహావీర్ కర్ణ “, “పొన్నియిన్ సెల్వన్ “, “విక్రమ్ 60 ” మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.