#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ

Tollywood Actress Sneha To Play A Key Role In NBK 106

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన స్నేహ వివాహానంతరం సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు , తమిళ మూవీస్ లో స్నేహ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన “వినయ విధేయ రామ ” మూవీ లో నటించిన స్నేహ తిరిగి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK 106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రకు జోడీగా సీనియర్ హీరోయిన్ స్నేహ ఎంపిక అయ్యారు. మరో పాత్రకు ఒక కొత్త హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు. #NBK 106 మూవీలో బాలకృష్ణ అఘోరా గా నటిస్తున్నారు. ఆ పాత్ర సినిమా లో హైలైట్ గా ఉంటుందని సమాచారం. బోయపాటి శ్రీను ,బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ #NBK 106 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =