“చంద్రముఖి ” మూవీ సీక్వెల్ హీరోయిన్ కియారా అద్వానీ ?

Tollywood Actress Kiara Advani To Play The Lead Role In Chandramukhi Movie Sequel

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు , జ్యోతిక , నయనతార ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ హారర్ “చంద్రముఖి “తమిళ మూవీ 2005 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “చంద్రముఖి ” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. “చంద్రముఖి ” మూవీ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ , జర్మన్ , టర్కిష్ భాషలలో రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు “చంద్రముఖి ” మూవీ కి సీక్వెల్ రూపొందనుంది. నటుడు , కొరియోగ్రాఫర్ , నిర్మాత , దర్శకుడు, సక్సెస్ ఫుల్ “ముని “, “కాంచన “, “శివలింగ ” వంటి కామెడీ హారర్ మూవీస్ ఫేమ్ రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో “చంద్రముఖి 2” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను”మూవీ ఫేమ్ కియారా అద్వానీ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. కియారా అద్వానీ ప్రస్తతం పలు హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన కామెడీ హారర్ “లక్ష్మీ బాంబ్ ” మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =