వర్మ ‘మర్డర్’ ట్రైలర్ రిలీజ్

Rama Gopal Varma Latest Movie Murder Trailer Is Out

సాహితి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ను తీస్తున్నట్టు ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటినుండి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేసాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తండ్రి త‌న కూతురిని గారాబంగా చూడడం, అమృత ప్రేమ‌లో ప‌డ‌డం, ప్ర‌ణ‌య్ హత్య ఇలా త‌దిత‌ర అంశాలు ట్రైల‌ర్‌లో చూపించారు. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలన కనగలమా? సమాధానం మీరే చెప్పండి అంటూ ఎలాంటి మాటలు లేకుండానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే స్టోరీ మొత్తం చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర రచనా, దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =