ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా ‘పొగ‌రు’ సినిమా నుండి రానున్న ‘క‌రాబు’ పాట

Karaabu Song From Dhruva Sarja and Rashmika Mandanna Pogaru Movie Will Be Out Soon

క‌న్న‌డ స్టార్ హీరో.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు ధ్రువ స‌ర్జా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘పొగరు’. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విక్ట‌రీ’, ‘అధ్య‌క్షా’, ‘ర‌న్న‌’, ‘ముకుంద మురారి’ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్న ప్లాన్లో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలోని కరాబు పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. ఇక ఇదే పాటను తెలుగులో రిలీజ్ చేసి తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగ‌స్ట్ 6న ఈ సినిమాలోని ‘క‌రాబు’ పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

కాగా ఇక డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్య‌క్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ వంటి పేరుపొందిన న‌టులు న‌టిస్తోన్న ఈ చిత్రంలో ‘డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ’ సూప‌ర్‌స్టార్లు కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్న‌ర్‌, జాన్ లూకాస్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చంద‌న్ శెట్టి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్‌, ఎడిట‌ర్‌గా కె.ఎం. ప్ర‌కాష్ ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 7 =