షూటింగ్ కు రెడీ – రష్మిక

Sarileru Neekevvaru Fame Actress Rashmika Mandanna Says Yes To Movie Shooting

పలు సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు , కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ కన్నడ బ్యూటీ రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో రష్మిక దూసుకుపోతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయికగా నటించిన పాన్ ఇండియా కన్నడ మూవీ “పొగరు ” తెలుగు లో రిలీజ్ కానుంది. “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. లాక్ డౌన్ సమయం లో రష్మిక కర్ణాటక రాష్ట్రం కూర్గ్ లో తన ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. 4 నెలలుగా ఇంటి వద్దే ఉన్న రష్మిక షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. షూటింగ్స్ లో పాల్గొనడానికి తాను రెడీయే నని , దర్శక , నిర్మాతల నుండి పిలుపు వస్తే తగు జాగ్రత్తలతో షూటింగ్ లో పాల్గొంటానని రష్మిక తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here