ఈ ఏడాది కరోనా వచ్చి ఒక పక్క సినీ పరిశ్రమకు అసలే తీవ్ర నష్టంలో ఉంటే.. మరోపక్క పలు సినిమా పరిశ్రమలకు చెందిన లెజెండ్రీ నటులతో పాటు కొంతమంది యువ నటీనటులు కూడా మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరో వెటరన్ నటుడు రావి కొండలరావు తుది శ్వాస విడిచారు. గుండెపోటు కు గురైన రావి కొండలరావు హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో చేరిపించగా.. అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, రచయిత, రంగస్థల నటుడు, బుల్లితెర, పత్రికలు ఇలా అన్ని రంగాలలోనూ మంచి అనుభవం వుంది రావి కొండలరావుకి. 1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావుకు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం ఎప్పటిదో. ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో నటించారు. 1965లో చదువు పూర్తి చేసి.. ఆ తర్వాత ఒక పత్రికలో సబ్ ఎడిటర్‌గా పని చేశారు. అప్పుడే ఆంధ్రపత్రికలో రావి కొండలరావు కథలు, రావి కొండలరావు నాటికలు ప్రచురితమయ్యేవి. బ్లాక్ అండ్ వైట్, మల్లీశ్వరి నవలా రూపం, మాయా బజార్ నవలా రూపం, షావుకారు నవలా రూపం ఇలా ఎన్నో రచనలు చేశారు రావి కొండలరావు. రావి కొండలరావు భార్య రాధా కుమారి. ఆమె కూడా సినిమా నటే. వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో భార్యాభర్తలుగా కలిసి నటించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























