ప్రజలకు మహేష్ బాబు సందేశం

Super Star Mahesh Babu Urges Everyone To Protect The Environment By Reducing Plastic Usage and Recycling Unused Products.

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి, ప్రతీ మంచి సందర్భానికి ట్వీట్స్ ద్వారా ప్రజలకు సందేశం ఇస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు ఇంటికి పరిమితం అయ్యి తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక సెట్స్ పైకి వెళ్ళనుంది .

ప్రపంచ సహజ వనరుల పరిరక్షణ దినోత్సవ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలకు సందేశం ఇచ్చారు. నీటిని కాపాడుదాం , ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం , రీసైకిల్ చేద్దాం , వ్యర్ధాలను ఉపయోగిద్దాం , పునరుత్పాదక శక్తిని వాడుకుందాం , ఈ కరోనా క్లిష్ట పరిస్థితులలో మనం మనల్ని రక్షించుకుంటూనే , ప్రకృతిని కూడా పరిరక్షించడం గుర్తుంచుకోండని , మార్పు మన ఇంటినుండే ప్రారంభిద్దాం అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here