బాలీవుడ్ ఆఫర్స్ అంత ఈజీ కాదు – రకుల్ ప్రీత్

Getting A Bollywood Movie Offer Is Not An Easy Task Says Actress Rakul Preet Singh

దక్షిణాది భాషల సినిమాలలో స్టార్ డమ్ పొందిన హీరోయిన్స్ తమ గోల్ గా బాలీవుడ్ ను ఎంచుకొంటారని తెలిసిన విషయమే. బాలీవుడ్ లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ వస్తుంది. అందుకే సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ మూవీస్ పై ఆసక్తి చూపుతారు. అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ అంత ఈజీ కాదని రకుల్ చెప్పారు. రకుల్ మాట్లాడుతూ .. దక్షిణాది భాషలలో స్టార్ డమ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పట్టించుకోదని , బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కెరీర్ మొదటి మెట్టునుండీ ప్రారంభించాల్సిందే నని , మూవీస్ సక్సెస్ ను బట్టి స్టార్ డమ్ వస్తుందని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ప్రవేశించి నటించిన “దేదే ప్యార్ దే “, “మర్జావాన్ ” మూవీస్ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. రకుల్ ప్రస్తుతం జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న “ఎటాక్ “, అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న “ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తున్నారు. “అయిలాన్ “, “ఇండియన్ 2 ” తమిళ మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు. నితిన్ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =