ఇంటిపేరు కాదు టాలెంట్ ఉంటేనే సక్సెస్..!

One Needs To Rely Only On Their Talent To Survive In The Film Industry Says Actress Shruti Haasan

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం పై పెద్ద ఎత్తునే చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు నెపోటిజంను మొదటి నుండి వ్యతిరేకించే బాలీవుడ్ క్వీన్ కంగనా పలువురిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో నేషనల్ వైడ్ గా ఈ టాపిక్ మరింత వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడగా ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.

ఇంటిపేరు నిజంగానే ఉపయోగపడుతుంది.. కెరీర్ స్టార్టింగ్ లో సినిమా అవకాశాలు రావాలంటే ఇంటిపేరు కొంతవరకూ ఉపయోగపడుతుంది.. కానీ ఆ తర్వాత మనకు టాలెంట్ ఉంటేనే నెగ్గుకురాగలం… నాకు మూవీస్ లోకి ఎంట్రీ ఈజీ గానే అయింది.. కానీ నేను కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను.. ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్నాను. ఎంతో కాలం తర్వాతే నాకు విజయం వచ్చింది. నా హార్డ్ వర్క్.. నా టాలెంటే ఇప్పుడు నన్ను ఈ పొజిషన్ లో ఉంచింది.. ఫైనల్ గా వారసత్వం వల్ల ఎంట్రీ ఈజీ అవుతుందేమో కానీ సక్సెస్ లు మాత్రం రావు అని తెలిపింది.

ఇక ప్రస్తుతం శృతి హాసన్ రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విజయ్ సేతుపతి తో తమిళ్ లో మరో సినిమా చేస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here