దుల్కర్ – హను రాఘవపూడి మూవీ అనౌన్స్ మెంట్.. ‘లెఫ్టినెంట్ రామ్’ ప్రేమక‌థ‌..

Ok Bangaram Fame Actor Dulquer Salmaan To Play The Role Of Lieutenant Ram in Hanu Raghavapudi Upcoming Movie

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్థింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ రోజు దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈసినిమా రూపొంద‌నుంది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ఈ సినిమాను కూడా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌లో స్వప్నా దత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ అవ్వగా.. ఈ ఏడాది చివరిలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =