డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?

Mass Maharaja Ravi Teja To Play The Role Of A Detective In His Upcoming Movie

“విక్రమార్కుడు “, పవర్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్రాక్ “మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “నేను లోకల్ “, “హలో గురు ప్రేమకోసమే ” మూవీస్ ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందే మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో రవితేజ డిటెక్టివ్ పాత్రలో నటించనున్నారని సమాచారం. రవితేజ ఫస్ట్ టైమ్ డిటెక్టివ్ గా నటించే ఈ మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. తమ అభిమాన హీరో రవితేజ డిటెక్టివ్ గా నటిస్తున్నారనే వార్త విన్న అభిమానుల ఆనందానికి హద్దే లేదు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + sixteen =