ఆనందంలో నాగశౌర్య

Tollywood Actor Naga Shaurya Shares His Happiness As His First Look Poster Of His New Movie NS20 Gets Good Response From Audience.

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్న ఈ మూవీ లో “రొమాంటిక్ ” మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న “NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన విశేష స్పందనకు ఆనందం తో హీరో నాగశౌర్య మాట్లాడుతూ .. “NS20 మూవీ లో ఒలింపిక్స్ పోటీలలో పాల్గొనాలనే ఆర్చర్ క్యారెక్టర్ లో నటిస్తున్నానని , ఈ పాత్ర లో ఫిట్ గా కనిపించడానికి లాక్ డౌన్ టైమ్ ఉపయోగపడిందని , బాడీ లాంగ్వేజ్ తో పాటు , విలువిద్య గురించి ఒక ప్రొఫెషనల్ ఆర్చర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని, తన లుక్ తో సంతోషంగా ఉన్నానని , షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి తో ఎదురుచూస్తున్నానని , కానీ లిమిటెడ్ యూనిట్ మెంబర్స్ తో ఈ మూవీ లోని కొన్ని సీన్స్ చిత్రీకరించలేమని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ షూటింగ్ కై వెయిట్ చేయాల్సిందేనని నాగశౌర్య చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here