దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు మహేష్. వైజయంతి బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ అతిధి పాత్రలో చేయడం విశేషం.ఇక ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో (2020 జులై 30) 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బంధం సహా హీరో మహేష్ బాబు ఈ సినిమా యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆమె కూడా తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకున్నారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్ర రావు కి, మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు మీతో పని చేసిన అనుభవం ఎంతో గొప్పది ఆ జ్ఞాపకాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో ప్రీతిజింతా మహేష్ బాబుల మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Thank you @Ragavendraraoba Garu & @urstrulyMahesh for an incredible experience. I will always cherish it 🙏 #Memories #21YearsForRajakumarudu https://t.co/jarYx6reaY pic.twitter.com/zTR67bcxjl
— Preity G Zinta (@realpreityzinta) July 31, 2020
రాజకుమారుడు ముందు ప్రీతిజింటా తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా అనే సినిమాలో నటించింది. ఇక రాజకుమారుడు సినిమా తర్వాత మళ్లీ ఆమె టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్ లోనే బిజీ అయిపోయింది ఈ భామ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: