‘మగధీర’ – ఆ సీన్ కోసం మారుతి వ్యాన్ టాప్ కట్ చేసిన జక్కన్న..!

Interesting Fact about Magadheera

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ‘మగధీర’ సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పడు ఒక సినిమా థియేటర్లో రెండు మూడు వారాలు ఆడితేనే పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సినిమా అప్పట్లో.. 299 కేంద్రాల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 223 కేంద్రాల‌లో 100 రోజ‌లు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా 11ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా విశేషాలను గుర్తుచేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట. మగధీర సినిమాలో రామ్ చరణ్, విలన్ మధ్య గుర్రపు స్వారీ కి సంబంధించి ఒక పోటీ ఉంటుంది కదా. అయితే ఆ షూటింగ్ గుజరాత్ లోని ధోలవిరా అనే ప్రాతంలో జరిపారట. అయితే అది సాల్ట్ ల్యాండ్ అంటే మొత్తం ఉప్పు ప్రాంతమే. ఆ ప్రాంతంలో హెవీ వెహికల్ తో షూటింగ్ అంటే చాలా కష్టం. అప్పుడు రాజమౌళి మారుతి వాన్ ఒకటి తెప్పించి.. దాని టాప్ ను కట్ చేసి అందులో కెమెరా పెట్టి.. దానితో పాటు చిన్న జిమ్మీ జిబ్ లో వెళ్తూ షూట్ చేశారట. మరి అంతకష్ట పడ్డారు కాబట్టే.. ఆ కష్టానికి ఫలితం దక్కింది.

మరి రాజమౌళి సినిమా అంటే అవార్డ్స్ కు కొదువలేదన్నట్టు.. ‘మగధీర’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ప్రభుత్వం నుంచి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు రామ్ చరణ్. అన్ని విభాగాలు కలిపి మగధీర’ చిత్రం మొత్తం తొమ్మిది నంది అవార్డులు కైవసం చేసుకుంది.

మొదటి సినిమా కాస్త నిరాశపరిచినా.. రెండో సినిమా మగధీరతో మాత్రం రామ్ చరణ్ గ్రాఫ్ మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. రామ్‌చరణ్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌, శ్రీహరి, దేవ్‌ గిల్‌ తమ నటనతో మెప్పించారు. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.

మరి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు జక్కన్న. మరి ఈ సినిమాతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =