మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2′, పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో ’18 పేజెస్’ చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏషియన్ గ్రూప్ సంస్థల్లో భాగమైన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీతో పాటు రెయిన్బో రీల్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోనాలీ నారంగ్ సమర్పించనున్నారు. ప్రొడక్షన్ వ్యవహారాలను రెయిన్బో రీల్స్ చూసుకోనుంది. ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు, నటీనటులు, ఇతర సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
ఇక ఈ సందర్భంగా నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసాడు. మీతో కలిసి పనిచేయనుండటం ఆనందంగా ఉంది.. మీరు అండగా ఉంటే మంచి సినిమాలు, ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Asian Movies 🙏🏼
Happy to sign with you… With your trust and backing we can make Better & Bigger films… @SVCLLP #Nikhil20 https://t.co/KCKgpPkoJM— Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2020
మరోవైపు, నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరి’ సినిమాని ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: