హ్యాపీ బర్త్ డే – నా ఓటు నీకే బ్రదర్

Actor Ram Pothineni Wishes Sonu Sood On His Birthday On Twitter

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. దీనితో సోనూసూద్ రియ‌ల్ హీరో అంటూ ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈరోజు సోనూసూద్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో రామ్ కూడా సోనూసూద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌జ‌లుంటారు.. హీరోలుంటారు.. మాన‌వతామూర్తులుంటారు. కానీ గొప్ప మాన‌వ‌త్వం క‌లిగిన వ్య‌క్తులున్న‌పుడు మ‌న‌కు హీరోలు అవ‌స‌రం లేదు. ప్రియ‌మైన సోద‌రుడు సోనూసూద్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.. నా ఓటు నీకే అంటూ సోనూసూద్ తో షూటింగ్ లో దిగిన పోస్ట్ చేస్తూ రామ్ ట్వీట్ చేశాడు. సోనూసూద్‌, రామ్ క‌లిసి కందిరీగ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సోనూసూద్‌, రామ్ ల మ‌ధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయి.

 

ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను… స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్ అని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.