సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అంత సులువేం కాదు. ఒకవేళ ఏదో ఒకరకంగా వచ్చినా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. హార్డ్ వర్క్ తో పాటు లక్.. లక్ తోపాటు టాలెంట్ ఇలా అన్నీ ఒకదానికొకటి కలిసొస్తేనే తప్పా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా సోనూ సూద్ ట్విట్టర్ లో తన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ తనపై తానే కామెడీ చేసుకున్నాడు. హేండ్సప్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు సోను సూద్. ‘సూపర్’ చిత్రం తొలి బ్రేక్నిస్తే.. ‘అరుంధతి’ చిత్రం సోనూ సూద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చివేసింది. ఆ తరువాత పలు తెలుగు చిత్రాలలో విలన్‌గా సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తన ట్విట్టర్ లో 1997 లో తీసుకున్న ఒక ఫొటో పోస్ట్ చేసిన సోనూసూద్ దానికి ఈ పర్సనాలిటీతో యాక్టర్ అయిపోదామని డేర్ చేసాను అంటూ కామెడీ చేసాడు. మరి ఇప్పుడు నిజం చెప్పాలంటే కొంత మంది హీరోల పర్సనాలిటీ, ఫిట్నెస్ తో పోల్చుకుంటే సోనుసూద్ పర్సనాలిటీ, ఫిట్ నెస్ చాలా బెటర్. యాక్టర్ కాకపోయినా స్టైలిష్ విలన్ అయ్యాడు. తెలుగు, హిందీ,తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
..and I dared to become an actor. #1997 pic.twitter.com/s8rlb5o8ni
— sonu sood (@SonuSood) July 30, 2020
ఇక ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు. లాక్డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ ఇప్పుడు చాలామందికి దేవుడయ్యాడు. కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులతో పాటు స్పెషల్ ట్రైన్స్, ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: