డిటెక్టివ్ పాత్ర లో స్టార్ హీరోయిన్ త్రిష

Actress Trisha To Play Detective In Her Upcoming Tamil Movie Kuttrapayirchi

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను సుమారు 2దశాబ్దాలుగా అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న త్రిష కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. త్రిష ప్రధాన పాత్రలో రూపొందిన “గర్జన “తమిళ మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. త్రిష ప్రస్తుతం 4 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. త్రిష ఇప్పుడు ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ గురు జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు బాలా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వెర్నిఖ్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో నిజ సంఘటనల ఆధారంగా “కుట్రపయిరిచి ” తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో త్రిష ఫస్ట్ టైమ్ ప్రైవేట్ డిటెక్టివ్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ చరిత్రలో మొదటిసారి ఒక మహిళ డిటెక్టివ్ గా నటించడం విశేషం. ఈ మూవీ లో ప్రియమణి , సురభి , సూపర్ సుబ్బరాయన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఉమెన్ డిటెక్టివ్ ఆఫ్ ఇండియా రజని పండిట్ ప్రేరణ తో ఈ మూవీ రూపొందుతుందని దర్శకుడు చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eleven =