‘ఘర్షణ’ సీక్వెల్ కావాలా?

Rana Daggubbati Quizzes Audience About Gharshana Movie On Twitter

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్.. ఆసిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఘర్షణ సినిమా అప్పట్లో ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను తమిళంలో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘కాక కాక’ మూవీకి రీమేక్. తమిళంలో సూర్య, జ్యోతిక పోసించిన పాత్రలను తెలుగులో వెంకటేష్, అసిన్‌‌లు చేసారు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా రిలీజై నేటికి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను గుర్తుచేసుకున్నారు రానా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేశాడు రానా . `ఘర్షణ` సినిమాకు 16 ఏళ్లు. మీలో ఎంత మంది `ఘర్షణ` సినిమా `సీక్వెల్`ను కోరుకుంటున్నారు? నేను చేస్తాను` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. `ఘర్షణ` సీక్వెల్‌లో వెంకీ, రానా కలిసి నటించాలని చాలా మంది ట్వీట్లు చేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

 

ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి.. ప్రస్తుతం రానా అరణ్య అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. విడుదలకి సిద్దంగా ఉన్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.