ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపై కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతుంది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్లిష్ట పరిస్థితులపై రకుల్ స్పందించారు. 2020 సంవత్సరం అంతా ఇబ్బందులతోనే కొనసాగుతుందని , ప్రతీ రోజూ భయాందోళనలతోనే బ్రతకవల్సిన పరిస్థితి ఏర్పడిందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఎన్నో పాఠాలు నేర్పిందని , ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణ తో కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా ను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఎటువంటి ఆపదలు మన దరికి జేరవనే ఆశతో జీవిద్దామని, మనం ఇంకా జీవించి ఉన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుదామని, ఇంటి వద్దే ఉంటూ కరోనా వ్యాప్తి ని నివారిద్దామని సూచించారు. రకుల్ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్స్ ప్రారంభం కానందున ఇంటి వద్దే ఉంటూ రకుల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులలో కరోనా పై చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2తమిళ, ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: