సినిమాలు షూటింగ్స్, యాడ్స్ షూటింగ్స్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబుకు లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. ఇక ఈ ఖాళీ సమయంలో పిల్లలు గౌతమ్, సితారాలతో కలిసి ఆటలు, పాటలు, కుకింగ్, స్విమ్మింగ్ అంటూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో ఎన్నో స్వీట్ మోమోరీస్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు అభిమానులతో కూడా పంచుకుంటూనే వున్నారు. ఇక నమ్రత అయితే మహేష్, గౌతమ్, సితారలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంది. లాక్ డౌన్ పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది నమ్రత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ చేసింది. మహేష్, సితారలకు సంబంధించిన ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఫొటో పోస్ట్ చేసి ఇద్దరూ వీడేమో గేమ్ కొనడంలో బిజీగా ఉన్నారంటూ పోస్ట్ లో పేర్కొంది. మరి నిజంగానే ఫొటోను చూస్తుంటే సితార-మహేష్ చాలా సీరియస్ గానే కొనే ప్లాన్ లో వున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: