సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ

South Indian First Cinema Scope Movie Alluri Sitarama Raju Is A Milestone Movie In Super Star Krishna Film Career

పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై వి. రామచంద్ర రావు దర్శకత్వంలో హీరో కృష్ణ కథానాయకుడిగా బ్రిటిష్ సామ్రాజ్యం పై పోరాటం జరిపిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ “అల్లూరి సీతారామరాజు ” 1974 సంవత్సరం మే 1 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. విజయ నిర్మల , జగ్గయ్య , చంద్ర మోహన్ , కాంతారావు , బాలయ్య , ప్రభాకర్ రెడ్డి ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కృష్ణ 100 వ చిత్రం గా రూపొందిన “అల్లూరి సీతారామరాజు ” మూవీ సౌత్ ఇండియా లో ఫస్ట్ సినిమా స్కోప్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ స్వంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ లో కృష్ణ పలికిన డైలాగ్స్ తూటాల్లా పేలాయి. ఈ మూవీ లోని “తెలుగు వీర లేవరా ” సాంగ్ రచయిత శ్రీశ్రీ బెస్ట్ లిరిసిస్ట్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. 175 రోజులు ప్రదర్శించబడిన “అల్లూరి సీతారామరాజు ” మూవీ హీరో కృష్ణ సినీ కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =