త్రోబ్యాక్ మ్యాజికల్ డే -అఖిల్ అక్కినేని

Akhil Akkineni Shares A Throwback Picture Taken During The Most Eligible Bachelor Movie Shoot In New York On Social Media

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ షూటింగ్ జరుగుతుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. సీనియర్ హీరోయిన్ ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

బన్నీ వాసు , వాసు వర్మ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది.రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ క్వారంటైన్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో అఖిల్ ఇప్పుడు న్యూయార్క్ లో మ్యాజికల్ డే అంటూ తాను న్యూయార్క్ షూటింగ్ లో పాల్గొన్న ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు . ఆ ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి జనవరి లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here