‘బిగ్ బాస్ 4’ షూటింగ్ మొదలుపెట్టిన నాగార్జున..!

Tollywood Actor Akkineni Nagarjuna Joins Promo Shoot Of Bigg Boss Season 4

అసలే లాక్ డౌన్.. అందరూ ఇంట్లోనే ఉన్నారు.. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇన్ని రోజులు సీరియల్స్.. ప్రోగ్రామ్స్ కు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే చిన్నగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి కరోనా వల్ల ఈ యేడాది ఎప్పుడో మొదలవ్వాల్సిన బిగ్‌బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యం అయింది. లేట్ అయినా.. లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ సిబ్బంది సిద్దమవుతున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్4 షూటింగ్ లో నాగ్ పాల్గొన్నట్టు తెలుస్తుంది. బిగ్‌బాస్ 4 కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. దీనిలో భాగంగానే.. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 4 యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారట. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ కు ప్రముఖ కెమెరా మెన్ సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత షూటింగ్ జరుగుతుండటంతో అన్నపూర్ణ స్టూడియోలో సందడి నెలకొన్నట్టు సమాచారం. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు.

ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి వారు పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున గ్రాండ్‌గా ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారట స్టార్ మా నిర్వాహకులు. ఈసారి మాత్రం 50 రోజులు మాత్రం షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.మరి ఇప్పటివరకూ జరిగిన మూడు సీజన్ లను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇక సీజన్ 4 కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల కొత్త కొత్త కాన్సెప్ట్ లు తీసుకొస్తున్నారు. చూద్దాం ఎలా వుండబోతుందో .

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 10 =