ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 69
పెళ్లి పనులు ప్రారంభం
షూటింగ్ కి రెడీ -పూజాహెగ్డే
రియల్ స్టార్ శ్రీహరి బయోపిక్ మూవీ ?
స్టార్ హీరో మమ్ముట్టి వర్కౌట్ సెల్ఫీ
‘ఆది పురుష్’ లో శూర్పణఖ గా..?

#NBK106 మూవీ కి కొత్త టైటిల్ ?
'ఆది పురుష్' లో ప్రభాస్ కు సరైన జోడి?

#Prabhas 21 " మూవీలో కీలక పాత్రలో నివేద థామస్ ?
"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి

సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' ప్రీ లుక్ రిలీజ్
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సీడీపీ వరల్డ్ రికార్డ్
కరోనా నుండి కోలుకున్నా.. నా బాధ బాలుగారి కోసమే
కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై కూడా కాస్త ఎక్కువగానే పడింది. రాజమౌళి అండ్ ఫ్యామిలీ, తేజ, డి.వి.వి.దానయ్య, డైరెక్టర్ అజయ్ భూపతి సహా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇక ఇటీవల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు కూడా కరోనా రాగ ప్రస్తుతం చెన్నైలో ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా సింగర్ సునీతకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తను కోలుకున్నట్టు తెలిపింది సునీత.
'ఆదిపురుష్' లో ప్రభాస్ పాత్ర చెప్పేసిన నాగ్ అశ్విన్
బాహుబలి సిరీస్ కు ముందు ప్రభాస్ రేంజ్ వేరు.. బాహుబలి సిరీస్ తర్వాత వేరు.. ఈ సిరీస్ తో ప్రభాస్ స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఒక గ్యాంగ్ స్టర్ అయినా లవర్ బాయ్ అయినా ఒక యోధుడిగా అయినా ఇలా ఒక్కటేంటి అన్ని రోల్స్ కు కూడా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏదో నాలుగు ఫైట్ లు నాలుగు పాటలు ఉన్న సినిమాలు చేయడానికి లేదు ప్రభాస్. ప్రభాస్ నుండి కూడా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే రోజులు పోయాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ అండ్ పాన్ ఇండియాగా 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్…
పాత పోస్టులన్నీ డిలీట్ చేసిన త్రిష .. ఎందుకబ్బా..?
'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. 'వర్షం' సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది.
'చిరు 152' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
చిరు పుట్టినరోజు కు ఇంకా నాలుగు రోజులు టైం ఉండగానే సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది. ఇప్పటికే చిరు పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఆలోచనతో కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 65 మంది సినీ ప్రముఖులతో చిరు కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక కామన్ డీపీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.
పెళ్లి పనులు ప్రారంభం
మెగా డాటర్ నిహారిక త్వరలోనే జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వీరిద్దరి నిశ్చితార్ధం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ-చైతన్య ఫ్యామిలీ సభ్యులు, కొద్దిపాటి సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. పెళ్లి డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. అక్టోబర్ లేదా నవంబర్‌లో నిహారిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉండగా పెళ్లి పనులు మాత్రం అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షూటింగ్ కి రెడీ -పూజాహెగ్డే
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "DJ", అరవింద సమేత వీర రాఘవ ", "మహర్షి ", "గద్దలకొండ గణేష్ ", "అల .. వైకుంఠపురములో .. " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించారు. "హౌస్ ఫుల్ 4" బాలీవుడ్ మూవీ ఘనవిజయం సాధించడంతో పూజాహెగ్డే బాలీవుడ్ లో రెండు పెద్ద మూవీ ఆఫర్స్ అందుకున్నారు. స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
రియల్ స్టార్ శ్రీహరి బయోపిక్ మూవీ ?
పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎస్ ఐ , రైల్వే ఆఫీసర్ గా జాబ్స్ వచ్చినా సినీ కెరీర్ గురించి వాటిని కాదని శ్రీహరి స్టంట్ ఫైటర్ గా టాలీవుడ్ లోప్రవేశించారు. హీరో, విలన్, కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి శ్రీహరి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "తాజ్ మహల్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శ్రీహరి బెస్ట్ విలన్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సూపర్ హిట్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా ", "ఢీ ", "మగధీర ", డాన్ శీను" , "అహనా పెళ్ళంట", "జబర్దస్త్ " వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శ్రీ హరి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు.
స్టార్ హీరో మమ్ముట్టి వర్కౌట్ సెల్ఫీ
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో సుమారు 400 మూవీస్ లో నటించి ,4దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం తో పాటు బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ , 12 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మమ్ముట్టి అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ "యాత్ర " మూవీ లో వై ఎస్ ఆర్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
‘ఆది పురుష్’ లో శూర్పణఖ గా..?
ఈరోజు ఉదయాన్నే తన అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు రెబల్‌స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ 21 సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చి కూడా చాలా కాలమైంది.

#NBK106 మూవీ కి కొత్త టైటిల్ ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ లో అమలా పాల్ ఒక కథానాయిక కాగా మరో కథానాయిక గా ఒక కొత్త నటి పరిచయం కానున్నారు.
'ఆది పురుష్' లో ప్రభాస్ కు సరైన జోడి?
అలా ప్రభాస్ 22 అప్ డేట్ వచ్చిందో లేదో ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యంలేదు. ప్రభాస్ హీరోగా ఓంరావుత్ దర్శకత్వంలో ‘అదిపురుష్’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ‘చెడుపై మంచి సాధించే విజయం' అనేది సినిమా ఇతివృత్తం. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇది మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుందన్న విషయం అర్థమైంది. పోస్టర్లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా సినిమాను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు.

#Prabhas 21 " మూవీలో కీలక పాత్రలో నివేద థామస్ ?
తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నివేద థామస్ , సూపర్ హిట్ "జెంటిల్ మన్ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. "నిన్నుకోరి ", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేద హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. నివేద ప్రస్తుతం "వకీల్ సాబ్ " మూవీ తోపాటు మరో రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు.
"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.
'ప్రభాస్ 22' టైటిల్ పోస్టర్ రిలీజ్
గత కొద్దినెలల ముందు అయితే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. ఒక్క అప్ డేట్ ఒకే ఒక్క ప్రభాస్ సినిమా అప్ డేట్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాస్త పంథా మార్చారు. ప్రభాస్ 20 రాధేశ్యామ్ సినిమా అప్ డేట్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ 22 సినిమా అప్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.
రజినీకాంత్ మొదటి తెలుగు సినిమా ఏంటో మీకు తెలుసా..?
నీ నడకల స్టైయిలదిరే.. నీ నవ్వుల కైపదిరే.. నీ మాటల తీరదిరే.. నీ చూపుకు ఎద అదిరే అంటూ బాషా సినిమాలో నగ్మా రజినీని ఊహించుకుంటూ పాట పడుతుంది. ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..' ఈ పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాటకు తగ్గట్టే రజనీ ఏం చేసినా అది స్టయిలే. ఆ నడకలో ఓ స్టయిల్... సిగిరెట్ ఎగరేయడం ఓ స్టయిల్... కూలింగ్ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్ ఇలా చేయడం ఆయనకు మాత్రమే సాటి. ఆ స్టయిల్ నచ్చే కదా సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆ హీరో ఎవరో ఈ పాటికే అర్దమైఉంటది. తలైవా రజినీ కాంత్.
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి
టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఎస్పీ బాలుకు కూడా కరోనా సోకిన సంగతి కూడా విదితమే. కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించి... ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం…

సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' ప్రీ లుక్ రిలీజ్
సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెం1 గా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్నే దక్కించుకున్నాడు.
అల్లు శిరీష్ 'గో లోకల్ బీ వోకల్' కి సూపర్ రెస్పాన్స్
దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని.. వీలైనన్ని ఎక్కువ ఇండియన్ బ్రాండ్స్‌ను వాడాలని, ప్రోత్సహించాలని 'గో లోకల్ బీ వోకల్' నినాదానికి అల్లు శిరీష్ తెరలేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు తాను సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన కొన్ని భారతీయ బ్రాండ్లను... వాటి పేర్లను చెబుతూ..దేశీ ఉత్పత్తులు వాడటమే కాదు వాటి గురించి మన నోటితో చెప్పాలి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. గో లోకల్ బీ వోకల్ అంటూ గతంలో ట్వీట్ చేశారు.
'సన్ ఆఫ్ ఇండియా' అంటున్న కలెక్షన్ కింగ్
మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశభక్తి నేపథ్యంలో సినిమాతో రాబోతున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ పోస్టర్ లో మోహన్ బాబు సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, టైటిల్ లో అశోక చక్రం.. బ్యాగ్రౌండ్ లో ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రత్నబాబు…
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సీడీపీ వరల్డ్ రికార్డ్
"అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ కళ్యాణ్ ", "బద్రి ", తొలిప్రేమ ", ఖుషి ", జల్సా ", "గబ్బర్ సింగ్ ", "అత్తారింటికి దారేది "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ "అజ్ఞాత వాసి " మూవీ తరువాత పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ప్రజా సేవ కై "జనసేన " పార్టీ ని స్థాపించారు. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ "వకీల్ సాబ్ "రూపొందుతుంది. "వకీల్ సాబ్ " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఒక సాంగ్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.