రియల్ స్టార్ శ్రీహరి బయోపిక్ మూవీ ?

A Biopic To Be Made On Real Star Srihari Life Story

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎస్ ఐ , రైల్వే ఆఫీసర్ గా జాబ్స్ వచ్చినా సినీ కెరీర్ గురించి వాటిని కాదని శ్రీహరి స్టంట్ ఫైటర్ గా టాలీవుడ్ లోప్రవేశించారు. హీరో, విలన్, కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి శ్రీహరి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “తాజ్ మహల్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శ్రీహరి బెస్ట్ విలన్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సూపర్ హిట్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, “ఢీ “, “మగధీర “, డాన్ శీను” , “అహనా పెళ్ళంట”, “జబర్దస్త్ ” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శ్రీ హరి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెటరన్ యాక్టర్ శ్రీహరి తెలుగు లోనే కాకుండా కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాష చిత్రాలలో నటించారు. పలు మూవీస్ తో బిజీగా ఉన్న శ్రీహరి 49 సంవత్సరాల చిన్న వయస్సు లోనే లివర్ ప్రాబ్లమ్ తో 2013 సంవత్సరం అక్టోబర్ 9 వ తేదీ మృతి చెందారు. రియల్ స్టార్ శ్రీహరి శ్రీమతి డిస్కో శాంతి , శ్రీహరి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రూపొందించడానికి ప్లాన్ చేశారని , ఒక ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ బయోపిక్ మూవీ కి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + sixteen =