‘సన్ ఆఫ్ ఇండియా’ అంటున్న కలెక్షన్ కింగ్

Dialogue King Mohan Babu Releases The Title Poster Of His New Movie Son Of India On Independence Day

మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సినిమాతో రాబోతున్నారు. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ పోస్టర్ లో మోహ‌న్ బాబు సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా, టైటిల్ లో అశోక చక్రం.. బ్యాగ్రౌండ్ లో ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో తెలియచేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా ప్రస్తుతం మోహన్ బాబు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భక్తవత్సలం నాయుడుగా ఎయిర్ ఫోర్స్ లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు.

విలన్ పాత్రలతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని… ఆ తర్వాత హీరో గా మారి చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =