‘చిరు 152’ ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

Muhurtham Fixed For Chiru 152 Movie First Look Release

చిరు పుట్టినరోజు కు ఇంకా నాలుగు రోజులు టైం ఉండగానే సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది. ఇప్పటికే చిరు పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఆలోచనతో కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 65 మంది సినీ ప్రముఖులతో చిరు కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక కామన్ డీపీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఇచ్చారు మెగా స్టార్. ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరుకి 152 సినిమా. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున రిలీజ్ చేయనున్నారు. దానికి ముహూర్తం ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆగష్ట్ 22న సాయంత్రం 4గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

 

కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =