సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ ప్రీ లుక్‌ రిలీజ్

Venkatadri Express Fame Actor Sundeep Kishan To Produce Vivaha Bhojanambu Movie

సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1 గా ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్నే దక్కించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సందీప్ కిషన్ పుట్టిన రోజున సందర్భంగా ఈ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు సందీప్ కిషన్ మరో నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి కూడా విదితమే. వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్‌ కిషన్‌, శినీష్, కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఈ సినిమా ప్రీ–లుక్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు వివాహ భోజనంబు టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు బిగ్ న్యూస్ అనగానే పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు… లాక్ డౌన్ మహిమ.. కానీ మా సినిమా ఫస్ట్ లుక్ అంటూ తన ట్విట్టర్ లో తెలిపాడు. త్వరలో ఫస్ట్‌ లుక్‌తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌, ఇతర నటీనటుల వివారాలను తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =