పెళ్లి పనులు ప్రారంభం

Niharika Konidela Wedding Festivities Begin At Their Home In Hyderabad

మెగా డాటర్ నిహారిక త్వరలోనే జొన్నలగడ్డ చైత‌న్య‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వీరిద్దరి నిశ్చితార్ధం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ-చైతన్య ఫ్యామిలీ సభ్యులు, కొద్దిపాటి సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. పెళ్లి డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. అక్టోబర్ లేదా నవంబర్‌లో నిహారిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉండగా పెళ్లి పనులు మాత్రం అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇక వీడియోను చూస్తుంటే..ఈ ముఖ్య కార్యక్రమంలో మెగా కుటుంబంలోని ఆడ‌వాళ్లంద‌రూ హాజరైనట్టు కనిపిస్తుంది. పెళ్లిక‌ళ ఉట్టిప‌డుతున్న నిహారిక ప‌సుపు కొమ్ములు దంచుతూ ఫొటోల‌కు పోజిచ్చారు.

 

ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. దీనితోపాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు కూడా నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + ten =