
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 67


'గుర్తుందా శీతాకాలం' లాంచ్ డేట్ ఖరారు

భక్తి పారవశ్యం లో రామ్ చరణ్
ప్రభాస్ కి చెల్లెలిగా నివేద థామస్..?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున ?

సినీ కార్మికులకు చిరు మూడోసారి సాయం

విషమంగానే బాలు ఆరోగ్యం - ఎస్పీ చరణ్ భావోద్వేగం

"ఆదిపురుష్ " మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ?

థియేటర్స్ లోనే "టక్ జగదీష్ "-నాని
చాలా మిస్ అయ్యా .. బ్యాక్ టు వర్క్..!
సత్యదేవ్-తమన్నా సినిమాకు డిఫరెంట్ టైటిల్..?

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా

'కె.జి.యఫ్' 2 - బ్యాక్ టు షూట్
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు

సామ్ 'గ్రో విత్ మీ ఛాలెంజ్'

'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ టీజర్ పై రాజమౌళి క్లారిటీ
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియో ఉంటుందని అనుకున్నారు కానీ కుదరలేదు. దానితో అభిమానులు కాస్త నిరాశకుగురయ్యారని చెప్పొచ్చు.

'గుర్తుందా శీతాకాలం' లాంచ్ డేట్ ఖరారు
కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా గుర్తుందా శీతాకాలం అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ వేశారు. అదే టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది.

భక్తి పారవశ్యం లో రామ్ చరణ్
మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో యాక్షన్ సీన్స్ , డ్యాన్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ ఎంటర్ టైనర్ "మగధీర " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1000 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ స్వంతం చేసుకుంది.

ఆగష్ట్ 17-21 - టాలీవుడ్ ఇంపార్టెంట్ అప్ డేట్స్ మీకోసం
గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

'ఆదిపురుష్' - ప్రభాస్ రాముడు అయితే.. రావణుడిగా ఎవరికి మీ ఓటు..?
బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటాడు. సాహో సినిమా ప్రభాస్‌ని అభిమానులకి మరింత దగ్గర చేసింది. దీనితో పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు ప్రభాస్. తన 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ ఇంకా పూర్తి కాక ముందే మరో రెండు సినిమాలను ఆయన ప్రకటించారు. అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కాగా, రెండో చిత్రం ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఆదిపురుష్’.

నావల్ల బాలు గారికి కరోనా రాలేదు.. మాళవిక క్లారిటీ
కరోనా కారణంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొద్దిరోజులుగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సింగర్స్ సునీత, మాళవిక కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాలుగారికి సింగర్ మాళవిక వల్లే కరోనా వచ్చిందని.. ఒక షో లో పాల్గొనడం వల్ల వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన మాళవిక ఈ వార్తల్లో లేదని.. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.
ప్రభాస్ కి చెల్లెలిగా నివేద థామస్..?
ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కూడా వుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున ?
కింగ్ నాగార్జున , దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన "శివమణి" (2003 ), "సూపర్ "(2005 ) మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఏ మూవీ తెరకెక్కలేదు. 15 సంవత్సరాల తరువాత ఇప్పడు పూరి జగన్నాథ్ , నాగార్జున హీరోగా ఒక మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు , ఆ ప్రపోజల్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సినీ కార్మికులకు చిరు మూడోసారి సాయం
కరోనా వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ఆర్ధికంగా దెబ్బతిన్నారు. కొంతం మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇక సినిమా పరిశ్రమలో కూడా ఎంతో మంది రోడ్డున పడ్డారు. షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఏదో ఒక రకంగా వారిని ఆదుకోడానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తూనే ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఇప్పటికే ఎన్నోకోట్ల రూపాయలు విరాళాలు అందించారు. ఇక మెగాస్టార్ సినీ కార్మికుల కోసం ఇప్పటికే చిరు కరోనా వైరస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వారికి రెండు విడతలు సాయం చేయగా ఇప్ప్పుడు మూడోసారి సాయం…

విషమంగానే బాలు ఆరోగ్యం - ఎస్పీ చరణ్ భావోద్వేగం
గత కొద్దిరోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా రావడంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మొదట నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం తర్వాత క్షీణించినట్టు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ బాగానే వున్నారని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం బాలు తనయుడు చరణ్ చెప్పిన మాటలు వింటుంటే మాత్రం ఇంకా బాలు పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది.

"ఆదిపురుష్ " మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ?
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 " మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తం గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ మూవీ "సాహో "తో ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని , క్రేజ్ పెంపొందించుకున్నారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న "#Prabhas 21" మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ"ఆదిపురుష్ " రూపొందనుంది. ప్రభాస్ హీరోగా నటించే మూవీస్ అన్నీ పాన్ ఇండియా , భారీ బడ్జెట్ తో…

చిరంజీవి బర్త్ డే సందర్భంగా "జాంబీ రెడ్డి "టీమ్ సర్ ప్రైజ్
సక్సెస్ ఫుల్ "అ !" మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో హారర్ , థ్రిల్లింగ్ "జాంబీ రెడ్డి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత సాంకేతికత తో, సరికొత్త విజన్ తో "జాంబీ రెడ్డి " మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. యానిమేషన్ , గ్రాఫిక్స్ హైలైట్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది .ఆ పోస్టర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. కరోనా కు , జాంబీ రెడ్డి కి సంబంధం తెర మీద చూడాల్సిందే.

థియేటర్స్ లోనే "టక్ జగదీష్ "-నాని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నాని తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఒక లేఖను పోస్ట్ చేశారు. డియర్ ఫ్యాన్స్ , ప్రస్తుతం మనం చాలా క్లిస్ట పరిస్థితులలో ఉన్నామని , థియేటర్స్ లో మూవీస్ చూసి ఎంజాయ్ చేసే పరిస్థితులలో లేమని , "V" మూవీ ని అనేక కారణాలతో OTT ద్వారా రిలీజ్ చేస్తున్నామని , ఇది ఒక కొత్త అనుభూతని , 12 సంవత్సరాలుగా తన కోసం మీరు థియేటర్స్ కు వస్తున్నారని , ఇప్పుడు తా నే మీ ఇంటికి వస్తున్నానని , "టక్ జగదీష్ "మూవీ…
చాలా మిస్ అయ్యా .. బ్యాక్ టు వర్క్..!
లాక్ డౌన్ వల్ల దాదాపు ఐదు నెలల నుండి షూటింగ్స్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్స్ లేక సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు అంటే ఒకే కానీ మరి ఎప్పుడూ బిజీగా వుండే వాళ్ళు ఇన్ని నెలలు పని లేకుండా ఇంట్లోనే ఉండాలంటే కష్టమే. ఈ నేపథ్యంలో షూటింగ్ ను చాలా మిస్ అయ్యాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.
సత్యదేవ్-తమన్నా సినిమాకు డిఫరెంట్ టైటిల్..?
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాను ప్రకటించారు. నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నారు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ 2007 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. "దేశముదురు " మూవీ లో హీరోయిన్ రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాక్షన్ సీన్స్ , సాంగ్స్ , అలీ కామెడీ ట్రాక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా
ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసి రానా కు కూడా ఛాలెంజ్ ను విసిరారు. శ్రుతీహాసన్ కూడా రానా ను నామినేట్ చేసింది. ఇక ఈ రోజు తన ఛాలెంజ్ ను పూర్తి చేసాడు రానా.

'కె.జి.యఫ్' 2 - బ్యాక్ టు షూట్
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండేది. చెప్పినట్టే అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. అయితే ఇంకా కొద్దిరోజుల షూట్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ షూట్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావుడి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అంటూనో.. ఆడియో రిలీజ్ అంటూనే.. సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఇలా నిత్యం హడావుడి.. బిజీ బిజీ గా ఉంటుంది. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. సెలబ్రిటీస్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ తాజాగా తమ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

సామ్ 'గ్రో విత్ మీ ఛాలెంజ్'
మనం చేసే పనుల ద్వారా అందరికంటే మనం కాస్త విభిన్నం అని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంత తాను చేసేపనులు ద్వారా తాను కాస్త భిన్నం అని నిరూపిస్తుంది ఎప్పుడూ. తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత క్రేజ్ ఏమన్నా తగ్గిందా అంటే.. అదే క్రేజ్.. అవే సూపర్ హిట్స్. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో.. హిట్స్ తో, ఆఫర్స్ తో దూసుకుపోతోందంటే అది కేవలం సమంతకు మాత్రమే సాధ్యమైంది. ఇక ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే వుంది.