థియేటర్స్ లోనే “టక్ జగదీష్ “-నాని

Tuck Jagadish Movie Will Release Only In Theaters Says Natural Star Nani, Actor Nani

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నాని తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఒక లేఖను పోస్ట్ చేశారు. డియర్ ఫ్యాన్స్ , ప్రస్తుతం మనం చాలా క్లిస్ట పరిస్థితులలో ఉన్నామని , థియేటర్స్ లో మూవీస్ చూసి ఎంజాయ్ చేసే పరిస్థితులలో లేమని , “V” మూవీ ని అనేక కారణాలతో OTT ద్వారా రిలీజ్ చేస్తున్నామని , ఇది ఒక కొత్త అనుభూతని , 12 సంవత్సరాలుగా తన కోసం మీరు థియేటర్స్ కు వస్తున్నారని , ఇప్పుడు తా నే మీ ఇంటికి వస్తున్నానని , “టక్ జగదీష్ “మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందని నాని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైం నెగటివ్ రోల్ లో నటించారు. ఇప్పటి వరకూ చిన్న సినిమాలు మాత్రమే OTT ద్వారా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక పెద్ద మూవీ “V” రిలీజ్ కావడం విశేషం. హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా ” మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో నాని నటించనున్నారు. సూపర్ హిట్ “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా పలు చిత్రాలతో హీరో నాని బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − two =