నావల్ల బాలు గారికి కరోనా రాలేదు.. మాళవిక క్లారిటీ

Singer Malavika Gives Clarity About SPBalasubramanyam Testing Positive For Corona Virus

కరోనా కారణంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొద్దిరోజులుగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సింగర్స్ సునీత, మాళవిక కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాలుగారికి సింగర్ మాళవిక వల్లే కరోనా వచ్చిందని.. ఒక షో లో పాల్గొనడం వల్ల వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన మాళవిక ఈ వార్తల్లో లేదని.. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామోజీ ఫిలిం సిటీలో జూలై 30,31 తేదీల‌లో బాలుగారిస్పెష‌ల్ ఎపిసోడ్స్ జ‌రిగాయి. జూలై 30న చాలా మంది సింగ‌ర్స్ పాల్గొన్నారు. నేను 31 పార్టిసిపేట్ చేశా. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని వెళ్ళా. బాలుగారు ఆగ‌స్ట్ 1న నాకు మెసేజ్ చేశారు. వ‌రుస షూటింగ్స్ వ‌లన అల‌సిపోయాను అని నాకు మెసేజ్ పెట్టారు. ఆగ‌స్ట్ 5న ఆయ‌న కరోనా సోకిన‌ట్టు వీడియో ద్వారా తెలిపారు. అయితే షోలో పాల్గొన్నాం కాబ‌ట్టి మ్యుజిషియ‌న్స్ మేము టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని ఆగ‌స్ట్ 8న నా రిపోర్ట్ వ‌చ్చింది.

షూటింగ్ జరిగింది జూలై 31న. అంతకు ముందు నాకు కరోనా వచ్చే అవకాశం లేదు. ఇంట్లో పెద్ద వాళ్లు, 5 నెల‌ల పాప ఉన్నారు. వారి జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ 5 నెల‌లుగా ఇంట్లోనే ఉన్నాం. స‌రిగ్గా 5 నెల‌ల త‌ర్వాత షోకి వెళ్లాను. నాకు అనుమానం వ‌చ్చి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని తేలింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా త‌ర్వాత మా అమ్మ,నాన్న‌, పాప‌కి వ‌చ్చింది. వాళ్ల రిపోర్ట్ ఆగ‌స్ట్ 9న వ‌చ్చింది. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు . మేం కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం.. బాధలో ఉన్నాం.. దయచేసి నాపై దుష్ప్రచారం చేయవద్దు. బాలుగారి ఫ్యామిలీ కూడా బాధలో ఉంది. ఇలాంటి సందర్భంలో అందరి బ్లెస్సింగ్ కావాలి. న‌న్ను దోషిగా నిల‌బెడుతూ, త‌ప్పుడు మెసేజ్‌ని ప్ర‌చారం చేసే వాళ్ళ వివరాలు సేక‌రించి సైబ‌ర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేస్తున్నా. అని తెలిపింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.