టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాను ప్రకటించారు. నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఒక డిఫరెంట్ టైటిల్ ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. మరి టైటిల్ అయితే డిఫరెంట్ గానే ఉంది. ఈ టైటిల్ నే ఖరారు చేస్తారా? లేక వేరే ఏదైనా పెడతారా?చూడాలి.
కాగా ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
విభిన్న పాత్రలతో ఈ మధ్య కాలంలో మంచి పేరును సొంత చేసుకున్నాడు సత్య దేవ్. రీసెంట్ గా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. తన నటనలోని మరో కోణం చూపించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక తమన్నా కూడా గ్లామరస్ పాత్రలు కాకుండా.. రియలిస్టిక్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
కృష్ణ, మిలన నాగరాజ్ కాంబినేషన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిన ‘లవ్ మాక్ టైల్’ ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. నేటి ఉద్యోగుల ప్రేమ, రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమా ద్వారా చూపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: