కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 66

Natural Star Nani V Movie Trailer Is Out
ట్రైలర్ & టీజర్

'V' ట్రైలర్ - ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు

కరోనా వల్ల థియేటర్ లో విడుదలవ్వాల్సిన సినిమాలు ఓటీటీ దారిన పడుతున్నాయి. మొదట ఓ రెండు మూడు నెలల్లో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నారు కానీ అసలు ఈ ఏడాది చివరి వరకూ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పటివరకూ హోల్డ్ లో పెట్టుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ కి వెళుతున్నాయి. అలా ఇన్ని రోజులు థియేటర్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమానే 'వి'. వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Rakul Preet Accepts Samantha's Challenge
సినిమా వార్తలు

సామ్ 'గ్రో విత్ మీ' ఛాలెంజ్ పూర్తి చేసిన రకుల్

'గ్రో విత్ మీ' ఛాలెంజ్.. సమంత కొత్తగా ముందుకు తీసుకొచ్చిన ఛాలెంజ్. లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వాడుకుంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని క‌రెక్ట్‌గా వినియోగించుకుంటున్న వారిలో స‌మంత కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే స‌మంత అర్బన్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లోని తన నివాసంలోని టెర్రస్‌పై ఉన్న ఖాళీ ప్లేస్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. ఇక తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కాయకూరల్ని పండించుకొని తినాలని కూడా పిలునిస్తుంది. అంతేనా కావాల్సిన టిప్స్ కూడా చెపుతుంది సామ్. ఇక ఈ ఆలోచనలో భాగంగానే వచ్చిందే ' 'గ్రో…

TFN Adminవాట్సాప్
Black Rose Movie Is A Perfect Debut For Me In To Tollywood Says Urvashi Rautela
సినిమా వార్తలు

'బ్లాక్ రోజ్' - తెలుగులో పర్ఫెక్ట్ డెబ్యూ

బాలీవుడ్ అందాల తార ఊర్వ‌శి రౌటేలా టాలీవుడ్ లోకి 'బ్లాక్ రోస్‌' అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సంప‌త్ నంది స్నేహితుడు మోహ‌న్ భ‌రద్వాజ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమాలో ఊర్వ‌శి రూటేలా లీడ్ రోల్ లో న‌టిస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఓకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో తెరెకెక్కించనున్నారు.

TFN Adminవాట్సాప్
Nothing Beats The Theater Experience Says RRR Director SS Rajamouli
సినిమా వార్తలు

థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఏది రీప్లేస్ చేయలేదు

లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. సినిమాల షూటింగ్లు జరుపుకోవచ్చు అని ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నా కరోనాకు భయపడి ఎవరూ పెద్దగా షూటింగ్ లకు వెళ్లట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపించట్లేదు. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో నాని 'వి'…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

24 "క్యారెట్" ఆనందంలో సమంత

తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను సమంత అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Raashi Khanna To Make Her Debut In To Web Series
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో రాశీఖన్నా

ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సమంత , కాజల్ అగర్వాల్ , తమన్నా , అంజలి తోపాటు రాశీఖన్నాకూడా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ , కోలీవుడ్ లలో రాశీఖన్నా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. షూటింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేస్తూ , తమిళ భాషను ప్రాక్టీస్ చేస్తూ , గిటార్ సాధన చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Samantha Akkineni Plans Her Entire Week Menu With Carrots From Her Home Garden
సినిమా వార్తలు

ఈవారం మెను మొత్తం 'క్యారెట్స్' అంటున్న సామ్

మాఇంట్లో ఈవారం మొత్తం మెను క్యారెట్స్ అంటుంది సమంత. మరి అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. లాక్ డౌన్ లో దొరికిన ఈ టైంను సామ్ చాలా బాగా ఉపయోగించుకుంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అర్బన్ ఫార్మింగ్ చేస్తూ ఇంట్లోనే చక్కగా సేంద్రియ పద్దతి ద్వారా కూరగాయలు పెంచుతూ.. తనకు కావాల్సిన కాయకూరల్ని తానే స్వయంగా పండించుకుంటుంది. అంతేకాదు తనలాగే అందరూ ఇంట్లోనే కూరగాయలు పెంచుకోమని.. దానికి సంబంధించి టిప్స్ కూడా చెపుతుంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

TFN Adminవాట్సాప్
Sharwanand Sreekaram Movie Team Releases An Interesting Update.
సినిమా వార్తలు

శర్వానంద్ "శ్రీకారం " మూవీ అప్ డేట్

"గమ్యం ", "రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి ", "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ ప్రస్తుతం "శ్రీకారం "మూవీ లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యంలో "శ్రీకారం " మూవీ తెరకెక్కుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Shares Throwback Pic From Her Paris Tour On Social Media
సినిమా వార్తలు

పూజాహెగ్డే స్టైలిష్ లుక్

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధేశ్యామ్ ", బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలకు పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Cult Movie Arjun Reddy Completes 3 Years
సినిమా వార్తలు

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "అర్జున్ రెడ్డి "

భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "అర్జున్ రెడ్డి" మూవీ 2017 సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. షాలిని పాండే కథానాయిక. "అర్జున్ రెడ్డి" మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్రస్టేటెడ్ లవర్ గా విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అభిమానులలో తనపెర్ఫార్మెన్స్ తో విజయ్ క్రేజ్ ను పెంపొందించుకున్నారు. "అర్జున్ రెడ్డి" మూవీ సందీప్ రెడ్డి వంగ కు దర్శకుడిగా మొదటి చిత్రం కావడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్ అక్కినేని న్యూ లుక్

హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఈ మూవీ ని 2021 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
Actor Naga Chaitanya To Do His First Horror Movie With Manam Fame Director Vikram Kumar
సినిమా వార్తలు

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా లాక్ డౌన్ కారణం గా షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన"లవ్ స్టోరీ "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.

Team TFNవాట్సాప్
Director Meher Ramesh Heap Praises On Tollywood Film Stars
సినిమా వార్తలు

టాలీవుడ్ హీరోలపై దర్శకుడు మెహెర్ రమేష్ ప్రశంసలు

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన మెహెర్ రమేష్ దర్శకుడిగా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి "వీరకన్నడిగ", "అజయ్ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ను రూపొందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సక్సెస్ ఫుల్ "కంత్రి "మూవీ తో మెహెర్ రమేష్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ తరువాత యంగ్ రెబెల్ స్టార్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన "బిల్లా " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మెహెర్ స్టైలిష్ మూవీ మేకర్ గా పేరుపొందారు. మెహెర్ దర్శకత్వంలో రూపొందిన "శక్తి ", "షాడో " మూవీస్ నిరాశ పరిచాయి. ప్రస్తుతం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ట్రెజరర్ గా మెహెర్ రమేష్ సేవలు…

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Black and White Photo Posted On Instagram Attracts Netizens Attention
సినిమా వార్తలు

సండే మూడ్ లో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో రకుల్ ప్రీత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం రెండు హిందీ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న రకుల్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. కరోనా కారణం గా స్టార్ హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్న తరుణం లో రకుల్ ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం.

Team TFNవాట్సాప్
Central Government Issues Fresh Guidelines Giving Permission To Outdoor Movie Shootings.
షూటింగ్ అప్‌డేట్

సినీ ప్రేక్షకులకు శుభవార్త

కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ లో మూవీ రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి , షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. సినిమా , టీవీ ఇండస్ట్రీస్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షూటింగ్ సమయం లో పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర సమాచార , ప్రచార శాఖా మంత్రి జవదేకర్ ఆదివారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్గ దర్శకా లను పాటిస్తూ షూటింగ్స్ జరుపుకోవచ్చని , షూటింగ్స్ ప్రారంభం కావడంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తంచేశారు .

Team TFNవాట్సాప్
KGF Chapter 2 Movie Team Releases An Interesting Update.
సినిమా వార్తలు

"KGF చాప్టర్ 2 " మూవీ అప్ డేట్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. అదే టీమ్ తో ఆ మూవీ సీక్వెల్ "KGF చాప్టర్ 2 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
SPCharan Quashes Rumors About SP Balasubrahmanyam Health Condition
సినిమా వార్తలు

అవి రూమర్స్ - నాన్న ఆరోగ్యంపై నేనే అప్ డేట్స్ ఇస్తా..!

గత రెండు రోజుల క్రితం బాలు ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పడంతో అందరూ చాలా కంగారు పడ్డారు. అయితే ఈ రోజు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు.. ఆయనకు మరోసారి కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వార్తలు రావటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందన్న వార్తలపై ఎస్పీ చరణ్ స్పందించి ఆ వార్తలను ఖండించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అర్జున్ రెడ్డి కాంబినేషన్ మరోసారి..?

సందీప్ రెడ్డి డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. రౌడీ బాయ్ విజయ్ దేవర‌కొండను స్టార్ హీరోను చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి. ఆ చిత్రంతోనే హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఇక ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా సందీప్ వంగానే డైరెక్ట్ చేయగా..షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు షాహిద్…

TFN Adminవాట్సాప్
Actress Samantha Akkineni Releases Common Display Picture Of Akkineni Nagarjuna
సినిమా వార్తలు

కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపీ రిలీజ్

లెజెండరీ యాక్టర్ , నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సక్సెస్ ఫుల్ "విక్రమ్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో సుమారు 100 సినిమాలతో మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా 1 నేషనల్ , 9 నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నాగార్జున అందుకున్నారు. "గీతాంజలి ", "శివ ", "హలో బ్రదర్ ", "క్రిమినల్ ", "నిన్నే పెళ్ళాడుతా ", "అన్నమయ్య ", " నేనున్నాను ", "సోగ్గాడే చిన్ని నాయనా " వంటి సూపర్ హిట్ మూవీస్ నాగార్జున సినీ కెరీర్ లో మైలు రాళ్ళు గా నిలిచాయి. నాగార్జున ప్రస్తుతం "వైల్డ్ డాగ్ ", "బ్రహ్మాస్త్ర "(హిందీ ) మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్